ఆంధ్రప్రదేశ్
లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో పాటు కొన్ని జిల్లాలో వడగాలులు వీస్తున్నాయి.
నేడు (గురువారం)కూడా కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే
అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు
చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రయాణాలు
అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
పార్వతీపురంమన్యం
జిల్లా కొమరాడలో నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు
అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 130
మండలాల్లో వడగాల్పులు, రేపు 5 మండలాల్లో తీవ్ర, 253
మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం , వైఎస్సార్ జిల్లాల పై వడగాల్పుల
ప్రభావం పడనుంది.
వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో బుధవారం నాడు 43.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణకు
వర్ష సూచన
తెలంగాణలోని
అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ నెల 7,8
తేదీల్లో మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ
శాఖ శాఖ పేర్కొంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 45డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
కాగా, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండలో 40 డిగ్రీల పైన ఉష్ణోగత్రలు రికార్డు
అయ్యాయి.