Mukhesh Ambani gets
place in Forbes Billionaires List Again
వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్
అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి చోటు సాధించారు. 2024 సంవత్సరానికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ స్థానం దక్కించుకున్నారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ళ ముఖేష్ టాప్–9గా నిలిచారు. 2023లో ముఖేష్ అంబానీ సంపద 83.4 బిలియన్ డాలర్లు.
భారతదేశంలో అంబానీ తరవాతి స్థానంలో
ఉన్న గౌతమ్ అదానీ, ఫోర్బ్స్ జాబితాలో 17వ ర్యాంకులో నిలిచారు. ఆయన సంపద విలువ 84 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ సంస్థ
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల కారణంగా గతేడాది అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించింది. ఆ ఆరోపణలు నిరూపణ కాని నేపథ్యంలో అదానీ
సంస్థ మళ్ళీ బలం పుంజుకుంది.
ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో మొత్తం 2,781 మంది ఉన్నారు.
గతేడాది జాబితాతో పోలిస్తే 141 మంది కొత్తగా ఈ జాబితాకెక్కారు. 2023తో
పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2
ట్రిలియన్ డాలర్లను తాకింది. ఫ్యాషన్, కాస్మెటిక్స్ రంగ దిగ్గజం బెర్నార్డ్
ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. 195
బిలియన్ డాలర్ల సంపదతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకు సాధించారు. 177
బిలియన్ డాలర్లతో ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకెర్‌బర్గ్ మూడోస్థానం సంపాదించారు.