కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ ఆ పార్టీకి గురువారంనాడు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీమానా చేసినట్లు గౌరవ్ వల్లభ్ తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
సనాతన ధర్మంపై కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేకుండా పోయిందని వల్లభ్ విమర్శించారు. సనాతన ధర్మం విషయంలో నాయకులకు కాంగ్రెస్ ఎలాంటి దిశానిర్దేశం చేయలేకపోయిందన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసే నినాదాలను తాను సమర్థించనని కుండబద్దలు కొట్టారు.పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రెండు పేజీల రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు.
ఇలా చేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. హృదయం బరువెక్కింది.చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇతరులకు హాని చేసే ఎలాంటి విషయాలను వెల్లడించడం నాకు ఇష్టం లేదంటూ వల్లభ్ ఎక్స్ వేదికలో రాసుకొచ్చారు. సత్యాన్ని దాచడం కూడా నేరం కాబట్టి, అన్ని విషయాలు మీ ముందుంచుతున్నానంటూ గౌరవ్ వల్లభ్ లేఖలో వాపోయారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు