స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో, దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి, 74,361 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి, 22579 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం రూ.83.44 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. టెక్ మహింద్రా సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు బుధవారం భారీలాభాలతో ముగియడంతో దేశీయ మార్కెట్లు క్రితం ముగింపు కన్నా భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఇక ముడిచమురు ధర దిగివచ్చింది. బ్యారెల్ 89.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్స్ కొనుగోలుకు సానుకూల వాతావరణం నెలకొనడంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో స్టాక్ సూచీలు పరుగులు పెడుతున్నాయి.