ఒలింపిక్స్ మెనూలో భారత వంటకాలు చేరాయి. త్వరలో పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో అన్నం, పప్పును చేర్చారు. దీంతో భారత ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఏ దేశంలో ఒలింపిక్స్ జరిగినా భారత ఆటగాళ్లు భోజనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు. ఇక నుంచి వారికి ఇబ్బందులు తొలగినట్లేనని చెప్పవచ్చు. పారిస్ ఒలింపిక్స్‌లో బాస్మతి బియ్యంతో వండిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ కూర, గోబీ, చికెన్, పుసుసులను చేర్చారు.
ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లకు అందించాల్సిన భోజనాల లిస్ట్ పంపించినట్లు భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. భారత్ పంపిన వంటకాల లిస్ట్‌ను
ఒలింపిక్స్ కమిటీ అంగీకరించినట్లు కేశవన్ వెల్లడించారు. నిపుణుల సూచనల మేరకు మెనూ లిస్ట్ తయారు చేసినట్లు శివ కేశవన్ ప్రకటించారు.