పసిడి ధర పరుగులు పెడుతోంది. తాజాగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1250 పెరిగి రూ.72250కు చేరింది. వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి 81194 రూపాయల గరిష్ఠాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 2295 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గడచిన వారంలోనే 10 గ్రాముల బంగారం ధర రూ.3 వేలకుపైగా పెరిగింది. ఆర్నమెంట్ గోల్డ్‌కు పెద్దగా డిమాండ్ లేకపోయినా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. గోల్డ్ ధర ఏడాది చివరి నాటికి రూ.82 వేలు దాటవచ్చనే అంచనాలతో సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి.దీంతో బంగారం ధర పరుగులు పెడుతోందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.