హామీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమికి అధికారమిస్తే
సామాజిక పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ
ఇచ్చారు. వాలంటీర్లు రాజకీయం చేయడానికి తాను వ్యతిరేకమన్న చంద్రబాబు, బాగా
చదువుకున్న వాలంటీర్లకు రూ. 50 వేల ఆదాయం వచ్చే మార్గం చూపుతానన్నారు. ఎన్డీయే
అధికారంలోకి వస్తే వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పారు. తనను సీఎం జగన్, పశుపతి అని విమర్శించడాన్ని
చంద్రబాబు ప్రస్తావించారు.
పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడిన శివుడు అని అర్థం
చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ
జట్టుకట్టాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడు, రావులపాలెం నియోజకవర్గం పరిధిలోని కొత్తపేటలో
నిర్వహించిన ప్రజాగళంలో పాల్గొన్నారు.