వాయనాడ్
లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
2019లో వాయనాడ్ నుంచి నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన రాహుల్
గాంధీ, ఈ సారీ కూడా అక్కడి నుంచి పోటీకి దిగారు.
నామినేషన్
కు ముందు భారీ వాయనాడ్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ సోదరి ప్రియాంక
గాంధీతో పాటు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి
దీప్ దాస్ మున్షి, కేరళ శాసనసభ ప్రతిపక్షనేత వీడీ సతీశన్, కేపీసీసీ ముఖ్యనేత ఎంఎం
హసన్ తో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీ
లో పాల్గొన్నారు.
సీపీఐ
అభ్యర్థి యానీ రాజా కూడా నేడే నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ(ఎం )నేతృత్వంలోని కేరళ
ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామిగా ఉంది.
ఇండీ
కూటమిలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉండగా, వాయనాడ్ లో
మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి.
సీపీఐ
అగ్రనేత డి. రాజా సతీమణి యానీ రాజా వాయనాడ్ నుంచి సీపీఎం మద్దతుతో పోటీకి దిగారు. వాయనాడ్
స్థానంలో బీజేపీ కూడా గట్టినేతను బరిలోకి దింపింది. ఎన్డీయే తరఫు బీజేపీ కేరళ అధ్యక్షుడు
కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
అన్నీ
రాజాపై రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని
సీపీఎం అగ్రనేత, కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు
తప్పుబడుతున్నారు.
కోజీకోడ్
లో బహిరంగ సభ వేదికగా కేరళ సీఎం పినరయి విజయన్, రాహుల్ ను విమర్శించారు.‘‘ జాతీయ
స్థాయి కమ్యూనిస్టు నేతగా పేరుగాంచిన యానీ
రాజాపై రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. మణిపూర్
వివాదంలో బీజేపీ తీరును తప్పుపట్టిన అన్నీ రాజాను దేశద్రోహి అంటూ విమర్శించారు. ఈ
విషయంలో రాహుల్ పాత్ర ఏంటి’’ అని విజయన్ ప్రశ్నించారు.దేశ వ్యాప్తంగా బీజేపీకి
వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో యానీ రాజా
పాల్గొన్నారన్న విజయన్, రాహల్ మాత్రం ఎక్కడా ఆందోళనల్లో కనపడలేదన్నారు.
బీజేపీ
కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడానికి కారణాలేంటని
సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ ప్రశ్నించారు. బీజేపీ పై ప్రతిపక్షాల పోరాటంలో తమది
కీలక పాత్ర అని చెప్పుకునే కాంగ్రెస్, కేరళ లో ఎందుకు పోటీ చేస్తుందని
ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసి
బీజేపీ ని ఓడిస్తే దాని ప్రభావం దేశమంతా ఉంటుంది కదా వ్యాఖ్యానించారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్
నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాదించింది. కాంగ్రెస్
15 చోట్ల గెలుపొందగా, దాని మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 చోట్ల,
రివెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కేరళ కాంగ్రెస్(ఎం)చెరొక స్థానంలో విజయం
సాధించాయి. అలెప్పీలో సీపీఎం అభ్యర్థి నెగ్గారు.