శ్రీకాకుళం
జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా నేత, కేంద్ర మాజీమంత్రి కిల్లి
కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, శ్రీకాకుళం జిల్లా
ప్రజలకు సేవ చేయాలనే తన ఆశయం వైసీపీ తో నెరవేరే అవకాశం లేకపోవడంతో పార్టీని
వీడుతున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకు
నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
2009 లో కాంగ్రెస్ పార్టీ
తరఫున శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఎర్రంనాయుడుపై విజయం
సాధించారు. యూపీఏ-2 హయంలో కేంద్రమంత్రిగా
పనిచేసిన కిల్లి కృపారాణి, 2019 ఎన్నికలకు
ముందు వైసీపీలో చేరారు. కానీ ఆమెకు ఆ పార్టీ నుంచి చట్ట సభలకు పోటీ చేసే అవకాశం
రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు రాజకీయవర్గాల్లో
చర్చ జరుగుతుంది.