ఛత్తీస్‌గఢ్‌లో
మావోయిస్టులకు
భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేటి(మంగళవారం) ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న
ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది మావోయిస్టులు చనిపోయారు.
స్థానికులను
మావోయిస్టులు హతమార్చడంతో బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులు
కూంబింగ్ నిర్వహించారు. దీంతో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.
దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతీగా కాల్పులు జరిపాయి. దీంతో 9 మంది మావోయిస్టులు
ప్రాణాలు కోల్పోయారు.
గంగుళూరు
పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఆపరేషన్ లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
వారం
రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు
మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న
బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది.
సంఘటనాస్థలం
నుంచి 9 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం
చేసుకున్నట్లు తెలిపిన ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయశర్మ, కూంబింగ్ ఇంకా కొనసాగుతోందన్నారు.