ఎన్నికల నియమావళిని సీఎం జగన్ మోహనర్ రెడ్డి
ఉల్లంఘించారని, బహిరంగ సభల వేదికగా ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు.
ఎన్నికల కోడ్ ను బేఖాతరు చేస్తున్న జగన్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను
కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిపై
సొంత పత్రికల్లో వైసీపీ చేస్తోన్న వ్యతిరేక ప్రచారంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు.
రూ. 20 కోట్లకు పరువునష్టం దావా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. పురందరేశ్వరిపై
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోందన్నారు.
సంధ్య మెరైన్ విషయంలో పురందరేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు
సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే
తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ లీగల్
సెల్ నేత మల్లిఖార్జున మూర్తి పాల్గొన్నారు.