భారత్
పట్ల బంగ్లాదేశ్ లోని ప్రతిపక్ష సభ్యులు
అనుసరిస్తున్న వైఖరిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తప్పుపట్టారు. బంగ్లాదేశ్ నేషనల్
పార్టీ (బీఎన్‌పీ) లేవనెత్తిన ‘బాయ్‌కాట్ ఇండియా’ ప్రచారాన్ని తప్పుపట్టారు. భారత
వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు చురకలు
అంటించారు.
‘భారత ఉత్పత్తులను తర్వాత బాయ్‌కాట్
చేయొచ్చని, అంతకంటే ముందు మీ భార్యలు కట్టుకున్న
భారత చీరలను తగలబెట్టాలంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్
ప్రధాని హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ , భారత్ అనుకూలమంటూ ప్రతిపక్ష బీఎన్‌పీ గగ్గోలు
పెడుతోంది. ఈ ఏడాదిలో హసీనా పార్టీ విజయం సాధించడంతో భారత్ సహకారం ఉందని
ఆరోపిస్తోంది. విద్వేషం చిమ్ముతూ భారత ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది
బాయ్‌కాట్ భారత్ పిలుపుపై షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను
‘గొప్ప స్నేహితుడు’ అంటూ పునరుద్ఘాటించారు. బీఎన్‌పీ నేతలు తొలుత వారి భార్యలు
భారత్ లో కొనుగోలు చేసిన చీరలు తగలబెట్టాలని చురకలు అంటించారు. బీఎన్‌పీ అధికారంలో
ఉన్నప్పుడు వారి భార్యలు భారత్ వెళ్లి చీరల
షాపింగ్ చేయడం తనకు తెలుసున్నారు. భారత్ లో కొనుగోలు చేసిన వస్త్రాలను బంగ్లాదేశ్‌లో
అమ్ముకునే వారని దుయ్యబట్టారు.
భారత్ నుంచి గరమ్ మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అవి లేకుండా బీఎన్‌పీ నాయకులు వంట చేసుకోగలరా అని దెప్పిపొడిచారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు