మండుతున్న
ఎండలతో ప్రజానీకంతో పాటు జీవరాశులు అల్లాడుతున్నాయి. ఓ వైపు నీటి వనరులు అడుగంటుతుండగా
వేడిగాలుల ధాటికి ప్రజలు నానా యాతన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు
ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ
హెచ్చరికలు జారీ చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో
ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా
వేస్తున్నారు.
ఏప్రిల్-జూన్
కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని
భారత
వాతావరణ విభాగం తెలిపింది. మధ్య, పశ్చిమ
ద్వీపకల్ప భారతదేశంలో అధిక వేడి ఉంటుంది.
పశ్చిమ
హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో
మాత్రమే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మైదాన
ప్రాంతాల్లో మాత్రం వేడిగాలులు వీచే అవకాశం ఉంది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో
వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.