మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో
మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ
ఘటనలో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు
కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా బలగాల నుంచి
తప్పించుకునేందుకు మావోయిస్టులు కాల్పులు జరిపారు.
ప్రతీగా పోలీసులు కూడా కాల్పులు
జరపడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
పోలీసుల సెర్చ్ ఆపరేషన్ ఇంకా
కొనసాగుతుంది. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం
చేసుకున్నారు. ఓ మావోయిస్టు మృతదేహాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనం
చేసుకున్నాయి.
బస్తర్ ప్రాంతంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో
ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
బిజాపూర్ సహా ఏడు జిల్లాలు బస్తర్ పరిధిలో ఉన్నాయి. బస్తర్ లోక్ సభ నియోజకవర్గంలో
ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.