శ్రీరామనవమి
సందర్భంగా అయోధ్య బాలరాముడి దర్శనానికి మూడురోజుల పాటు రోజంతా అనుమతించాలని కొందరు
కోరుతున్నారు. అయితే ఏ సంప్రదాయంలోనూ రోజంతా దర్శనానికి అనుమతించే ఆచారం లేదని సాధువులు
తేల్చి చెబుతున్నారు. ఈ విషయంపై సాధువుల అభిప్రాయాన్ని అయోధ్య శ్రీ రామ జన్మభూమి
తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది.
శ్రీరామనవమి
ఉత్సవాలు అయోధ్యలో ఏప్రిల్ 9
నుంచి ప్రారంభం కానున్నాయి. బాలరాముడి
దర్శనానికి 50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని
అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని అనుగుణంగా 24 గంటలూ ఆలయాన్ని తెరిచి ఉందచే
అంశాన్ని పరీశీలిస్తున్నారు. ప్రస్తుతం రోజులో 14 గంటలు ఆలయాన్ని తెరిచి ఉంచుతున్నారు. ప్రతీరోజు ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది
భక్తులు స్వామి అనుగ్రహం పొందుతున్నారు.
అష్టమి, నవమి, దశమి తిథుల్లో రామ మందిరాన్ని 24
గంటలూ తెరిచి ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అయోధ్య జిల్లా
యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
బాలనరాముడిని నిద్రపోనివ్వకపోవడం ధర్మశాస్త్రాల
ప్రకారం సరికాదని సాధువులు అంటున్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా
రాంలల్లా ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్నట్లు చెప్పారు. వారిని 24 గంటలూ మెలకువగా ఉంచడం సరికాదు. పూర్తిస్థాయి చర్చల
తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.