ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత పెంచింది. లెబనాన్ భూభాగంపై శనివారం భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ సైనిక సలహాదారు సహా, పలువురు ఎంబసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది.
ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో ఇరాన్ ఎంబసీ భవనం కుప్పకూలిపోయింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు జనరల్ అలీ రెజా జెహ్ దీ చనిపోయారు. ఇతను సిరియా, లెబనాన్ దేశాల్లో ఖుడ్స్ దళాలకు నాయకత్వం వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దాడి తరవాత సిరియా ఆ ప్రాంతంలో సహాయ చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాదులకు సహాయం అందించే వారిపై మరిన్ని దాడులు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించింది.