కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ సూచీలు లాభాల పరుగులు తీశాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా అందిన సానుకూల సంకేతాలతో ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్ల కొనుగోళ్లకు దిగడంతో స్టాక్ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు పెరిగి 74254కు చేరింది. నిఫ్టీ 135 పాయింట్లు ఎగబాకి 22462 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహింద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధరలు దిగివచ్చాయి. బ్యారెల్ 86.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం 31 గ్రాములు 2270 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం 83.40 వద్ద ట్రేడవుతోంది.