మద్యం పాలసీని కొందరికి అనుకూలంగా మలచిన కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో కొన్ని అభ్యర్థనలు చేశారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఈడీ అధికారులు ఆయన్ని తిహార్ జైలుకు తరలించారు. జైల్లో తనకు మూడు పుస్తకాలు, బల్ల, కుర్చీ, మందులు, తగిన ఆహారం అందించాలని వీటికితోడు తన లాకెట్ తన వద్దే ఉండేలా చూడాలని కోర్టును కోరారు.
రామాయణం, భగవద్గీత, ప్రముఖ జర్నలిస్ట్ నీరజా చౌదరి రచించిన హౌ ప్రైమ్ మినిష్టర్స్ డిసైడ్ అనే పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ కోర్టును అభ్యర్థించారు. వీటిని సమకూర్చాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో అప్లికేషన్ సమర్పించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని అనుకూలంగా మలచుకుని మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మార్చి 21 నుంచి ఈడీ కస్టడీలో ఉన్నారు. నేటితో కస్టడీ ముగియడంతో కోర్టు ఆదేశాల మేరకు జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు