ప్రాణాలు నిలిపే డాక్టర్లకే మచ్చ తెచ్చాడు ఓ నీచుడు. ఏలూరు శివారు చొదిమెళ్లలో పోస్టాఫీసులో పనిచేసి రిటైర్డైన ఉద్యోగి మల్లేశ్వరరావుకు ఓ ఎంబీబీఎస్ డాక్టర్ మత్తు మందు ఇంజక్షన్ చేసి ఇంట్లో చోరీ చేశాడు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కొవ్వూరి భానుచందర్ గతంలోనూ ఇలాంటి దొంతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మల్లేశ్వరరావుకు మత్తు మందు డోస్ ఎక్కవ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.
గతంలో డాక్టర్ కొవ్వూరి భానుచందర్ వైద్యంపేరుతో మత్తు మందిచ్చి కొందరి వద్ద బంగారం దోచుకున్న కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో అతనిపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అయితే తక్కువ డోసులో మత్తు ఇవ్వడం వల్ల తరవాత వారు నిదానంగా కోలుకునే వారు. అయితే తాజా ఘటనలో మల్లేశ్వరరావుకు మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు