లిబియాలో తిరుగుబాటుదారులు ఏకంగా ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేబా నివాసంపై రాకెట్ గ్రనేడ్ ప్రయోగించారు. ఈ దాడిలో ఎవరికీ హాని జరగలేదని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ప్రధాని నివశించే భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ప్రధాని నివాసం వద్ద భారీ పేలుడు శబ్ధం వినిపించిందని స్థానికులు చెప్పారు. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తయ్యాయి.
ఒకటిన్న దశాబ్దాలుగా లిబియాలో శాంతి భద్రతల సమస్యలున్నాయి. పాలనపై పట్టుకోసం తూర్పు, పశ్చిమ వర్గాలు ఒకరిపై ఒకరు తలపడుతున్నారు. ఎవరి ప్రాంతంలో వారు పాలన సాగిస్తున్నారు. 2021లో ఐక్యరాజ్యసమితి అబ్దుల్ హమీద్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తూర్పు ప్రాంతంలో నాయకులు హమీద్ పాలనను వ్యతిరేకిస్తున్నారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్