టీడీపీ
అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు మేలు జరగడం చంద్రబాబుకు గిట్టడం లేదన్నారు. నిమ్మగడ్డ
రమేష్ చంద్రబాబు తరఫున పని చేస్తున్నారని ఆరోపించిన సజ్జల రామకృష్ణారెడ్డి, సిటిజన్
ఫర్ డెమొక్రసీలో చంద్రబాబు మనుషులే పనిచేస్తున్నారని
మండిపడ్డారు.
వాలంటీర్ వ్యవస్థను బాబు
పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవని
దుయ్యబట్టారు.
చంద్రబాబుకు
ఇంగిత జ్ఞానం ఉందా ఆగ్రహం వ్యక్తం చేసిన
సజ్జల, వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుందని
ప్రశ్నించారు. ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా అని నిలదీశారు. జనసేనకు
కేటాయించిన సీట్లలో కూడా చంద్రబాబు మనుషులే ఉన్నారని ఆరోపించారు.
చంద్రబాబు
లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజల
అవసరాలు చంద్రబాబుకు పట్టవా అని నిలదీశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే వైసీపీకి
స్టార్ క్యాంపెనర్లు అని సజ్జల పేర్కొన్నారు. కుట్రలు చేసేవారు ఎవరో మేలు చేసేవారు
ఎవరో ప్రజలకు అర్థం అయిందన్నారు.