సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎన్నికలయ్యే వరకు ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అక్కడి సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారని సెర్ఫ్ సీఈఓ ప్రకటించారు. కోడ్ అమల్లో ఉన్నందుకు వలంటీర్లు పింఛన్లు పంపిణీలో పాల్గొనవద్దని కూడా సెర్ఫ్ సీఈవో ఆదేశించారు. పింఛన్లు పొందుతున్న వారు ఆధార్‌కార్డు చూపించి వార్డు, గ్రామ సచివాలయాల్లో పింఛన్లు తీసుకోవాలని సెర్ఫ్ సీఈవో సూచించారు.
నగదు పంపిణీ పథకాలకు వలంటీర్లు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన మేదట, సెర్ఫ్ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. వలంటీర్ల వద్ద ఉన్న ట్యాబ్‌లు, డివైస్‌లు అన్నీ జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించాలన్నారు. పథకాల అమలుకు వలంటీర్లకు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలని సీఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.