నమ్మినోళ్ళను నట్టేట ముంచే వ్యక్తి
వైసీపీ అధినేత జగన్ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో
భాగంగా ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబు, ఈ సారి
ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు.
టీడీపీ
డీఎన్ఏలోనే బీసీ ఉందన్న చంద్రబాబు, వైసీపీ ఒకే సామాజికవర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక
న్యాయం అంటుందని విమర్శించారు. రాయలసీమలో
102 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
టీడీపీకి అధికారమిస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తామని
వాగ్దానం చేశారు.
వెనుకబడిన
వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్న
చంద్రబాబు, దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తామన్నారు. కురబలను ఎస్సీల్లో చేర్చడంతో
పాటు, బోయలను
ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చేనేతలో ఎక్కువగా ఉండే ఎమ్మిగనూరులో
టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
బీసీ
భవనాలు కట్టిస్తామన్నారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తామన్నారు. హ్యాండ్ లూమ్
కు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందజేస్తామని
చంద్రబాబు అన్నారు. టికెట్ల కేటాయింపులో వెనుకబడిన వర్గాలకు టీడీపీ ప్రాధాన్యం
ఇచ్చిందన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు