బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీకి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అందించారు. అనారోగ్యం కారణంగా శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారతరత్న అవార్డుల ప్రధానోత్సవానికి అడ్వాణీ హాజరు కాలేకపోయారు. ఇవాళ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి భారతరత్న అందించారు.
దేశంలోనే అత్యున్న పురస్కారం అందుకున్న బీజేపీకి చెందిన రెండో నేతగా అడ్వాణీ నిలిచారు. అడ్వాణీ నివాసంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము భారతరత్న అందించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాసేపు అడ్వాణీతో ప్రధాని మోదీ ముచ్చటించారు. యోగక్షేమాలు అడగి తెలుసుకున్నారు.