ఎన్నికల
వేళ బీజేపీ మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. ఇందిరాగాంధీ హయాంలో ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు అప్పగించిన విషయంపై
ఆర్టీఐ ఇచ్చిన సమాధానాన్ని ట్వీట్టర్ లో ప్రధాని మోదీ షేర్ చేశారు.
ఇందిరాగాంధీ
ప్రధానిగా ఉన్న సమయంలో 1974లో ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు
అప్పగించినట్లు ఆర్టీఐ ఇచ్చిన రిప్లైని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా
స్పందించారు.
‘‘కచ్చతీవు
దీవిని కాంగ్రెస్ నిర్మొహమాటంగా శ్రీలంకకు ఇచ్చేసిందన్న నిజం వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ను విశ్వసించలేం.. ప్రతి భారతీయుడికి ఈ ఘటన కోపం తెప్పిస్తుంది.’’ అని
ట్వీట్ చేశారు.
భారతదేశ
ఐక్యత, సమగ్రతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉందన్నారు.
బీజేపీ తమిళనాడు స్టేట్ చీఫ్ అన్నామలై, కచ్చాతీవు పై ఆర్టీఐ ద్వారా సమాచారం
కోరారు.