రైల్వే
స్టేషన్లు, బస్ స్టాప్‌లు, ఎయిర్
పోర్టులు సహా ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఉండే
మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించకపోవడం మంచిదని కేంద్రం
ప్రభుత్వం హెచ్చరించింది.
పబ్లిక్
ప్లేసుల్లోని పోర్టుల ద్వారా సైబర్ క్రిమినల్స్, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో
ప్రజలను కేంద్రప్రభుత్వం అప్రమత్తం చేసింది.
పోర్టుల ద్వారా ఫోన్లలోకి మాల్వేర్
చొప్పించి, డేటాను దొంగలించే అవకాశం ఉందని పేర్కొన్న కేంద్రం, ఈ తరహా
జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
ఫోన్లలో
మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్‌కు
తెలీయకుండా ఇన్స్టాల్ చేసి డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్.
డేటా
తస్కరణ రిస్కుతో పాటూ నిందితులు ఈ సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడే
అవకాశం ఉందని సూచించింది.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ప్రజలంతా అప్రమత్తంగా
వ్యవహరించాలని కేంద్రప్రభుత్వం తెలిపింది.
వీలైనంత
వరకూ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయడం ఉత్తమం. సైబర్ దాడులు జరిగిన
సందర్భాల్లో 1930 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం
అందించాలి. ప్రభుత్వ వెబ్సైట్ www.cybercrime.gov.in ను సందర్శించి కూడా ఫిర్యాదు చేయొచ్చు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు