పుట్టిన రోజు వేడుక ఓ చిన్నారి ప్రాణాలను హరించి వేసింది. జన్మదిన వేడుక జరుపుకునేందుకు పంజాబ్లోని పటియాలాకు చెందిన ఓ కుటుంబం ఆన్లైన్లో కేక్ ఆర్డర్ పెట్టింది. కేక్ విషపూరితం కావడంతో జన్మదిన వేడుక జరుపుకున్న పదేళ్ల చిన్నారి మాన్వి చనిపోయింది. ఈ నెల 24న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా ఘోరం వెలుగులోకి వచ్చింది. మార్చి 24 సాయంత్రం 7 గంటలకు మాన్వి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. రాత్రి 10 గంటలకు కేక్ తిన్న వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చిన్నారి తీవ్రంగా దాహం వేస్తోందని మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి మాన్వి ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేక్ విషపూరితం కావడం వల్లే మాన్వి ప్రాణాలు కోల్పోయిందని ఆందోళనకు దిగారు. బేకరీ యజమానిపై కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నివేదిక కోసం వేచిచూస్తున్నారు.