డీఎస్సీ నిర్వహణను వాయిదా వేయాలని ఎన్నికల
కమిషన్ ఆదేశిచింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం
చేసింది. దీంతో జూన్ 4 తర్వాతే డీఎస్సీ
నిర్వహించే అవకాశం ఉంది.
సచివాలయాల పరిధిలోని వలంటీర్ల విషయంలో కూడా ఈసీ
కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. పింఛన్ల పంపిణీ విధుల నుంచి వలంటీర్లను తప్పించిన
ఈసీ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నన్ని రోజులు వలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ లను
కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వలంటీర్ల పనితీరుపై వస్తున్న ఫిర్యాదులు, కోర్టుల్లో
పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది.