సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలుపే
లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రమిస్తోంది. ప్రత్యర్థులుకు దీటుగా ప్రచారంలో
దూసుకెళుతున్న బీజేపీ, 27 మందితో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మేనిఫెస్టో అధ్యక్షుడిగా
వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా
వ్యవహరిస్తారు.
ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, భూపేందర్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్
యాదవ్, వసుంధర రాజే, రవిశంకర్ ప్రసాద్, హిమంత బిస్వా శర్మ సభ్యులుగా ఉన్నారు.