కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
వైఎస్ షర్మిల, విజయవాడలో 9 గ్యారెంటీలు ప్రకటించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్
గ్యారెంటీలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించిన షర్మిల, వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కూడా
ఇంటింటికి తిరిగి ప్రతీ ఒక్కరికి వివరించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు
1. ఆంధ్రపదేశ్‌కు పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
వచ్చిన వెంటనే అమలు
2. మహిళా వరలక్ష్మీ పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు
రూ.8,500 సాయం అందజేత
3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర
చెల్లింపు
5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400కు పెంపు
6.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7. కాంగ్రెస్‌కు అధికారమిస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. అర్హులైన ప్రతీ పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇళ్ళు
9. అర్హులైన
ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను… ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికీ సామాజిక
పింఛన్లు. వికలాంగులకు రూ. 6 వేల పింఛను