ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తేర్సెమ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తేర్సెమ్ హత్యకు సంబంధించిన మాజీ ఐఏఎస్ అధికారి సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాబా టార్సెమ్ సింగ్ గురువారం గురుద్వారా ఆవరణలో ఉండగా మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దగ్గర నుంచి కాల్చి చంపిన సంగతి తెలిపిందే. కాల్పులకు తెగబడ్డ వారు సరబ్‌జిత్ సింగ్, అమర్జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నానక్‌మట్టా గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి హర్బన్స్‌సింగ్ చుగ్‌తోపాటు బాబా అనూప్ సింగ్, ప్రాంతీయ సిక్కు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ సింగ్ సంధు కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.
కాల్పులకు తెగబడిన సరబ్‌జిత్ సింగ్ పంజాబ్‌లోని తరన్ తరణ్ నివాసిగా గుర్తించారు. ఇక అరమర్జీత్ సింగ్ యూపీలోని రాంపూర్‌కు చెందిన వాడిగా పోలీసులు చెబుతున్నారు. వారిపై ఐపీసీ 302, 120బి, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.