గడిచిన ఐదేళ్ళ పాలనలో రాయలసీమకు సీఎం
జగన్ ఏం చేశారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో
భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల
ప్రజలు కూడా జగన్‌ను నమ్మడం లేదన్నారు. ‘ట్రెండ్ మారింది.. ప్రజలు వైసీపీ బెండు తీస్తారు’ అని ఎద్దేవా చేశారు.
కడపకు స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే
వేలమందికి ఉద్యోగాలు వచ్చేవన్న చంద్రబాబు, టీడీపీ హయాంలోనే కియా మోటార్స్ ఏర్పాటు
అయిందన్నారు. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచమంతా
పరిగెడుతున్నాయన్నారు.
రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే
మిన్నగా తయారవుతుందన్నారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావడమే లక్ష్యమన్నారు.పోలవరం
పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలని వివరించారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనది అని హామీ
ఇచ్చిన చంద్రబాబు…‘‘ క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ ’’ అని నినదించారు. అసమర్థ, అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.