రాష్ట్రపతి
భవన్లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం నేటి ఉదయం జరిగింది. మాజీ ప్రధాని పీవీ
నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల
మీదుగా అవార్డు స్వీకరించారు.
బిహార్
మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, మాజీ ప్రధాని చౌధురి చరణ్ సింగ్, శాస్త్రవేత్ ఎంఎస్ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు.
చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్
సింగ్ అవార్డు అందుకున్నారు.
మాజీ
ఉపప్రధాని ఎల్కే అద్వానికి ఆయన నివాసంలో భారతరత్న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అద్వాని
నివాసానికి వెళ్ళి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు.
ఇటీవల
కేంద్రప్రభుత్వం ఐదుగురికి భారతరత్న ప్రకటించింది. నేడు వారికి భారతరత్నను రాష్ట్రపతి
ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్ర పతి జగదీప్,
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర కేంద్రమంత్రులు పాల్గొన్నారు.