భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై క్రిమినల్ కేసు నమోదైంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండలో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేటీఆర్‌పై హనుమకొండలో కేసు నమోదు చేశారు.
తెలంగాణ సీఎం తీవ్ర అవినీతికి పాల్పడుతున్నాడంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ కేసు నమోదుకు దారితీశాయి. కాంగ్రెస్ నేత శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండలో కేసు నమోదు చేసి, హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు