లైంగిక వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలైంది. విశాఖ మధురవాడలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుకుంటోన్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్ చదువుకుంటోన్న విద్యార్థిని గురువారం రాత్రి వసతి గృహం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రాసిన సూసైడ్ లేఖ బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన వ్యవసాయ కూలీ తన కుమార్తెను విశాఖ మధువాడలోని ఓ కాలేజీలో చదివిస్తూ అక్కడే హాస్టళ్లో ఉంచారు.టీచింగ్ స్టాఫ్ లైంగిక వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆత్మహత్యకు ముందు విద్యార్థిని ఆమె చెల్లితో జరిపిన వాట్సాప్ చాట్ వెలుగు చూసింది. బోధనా సిబ్బంది లైంగిక వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు