భారత నేవీ మరోసారి సత్తా చాటింది.
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపలబోటుతో పాటు అందులోని పాకిస్తానీయులను
రక్షించింది. సుమారు 12 గంటలపాటు శ్రమించి పాకిస్తాన్‌కు చెందిన 23
మంది సిబ్బందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలోని సోకోట్రా
ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్‌కు చెందిన చేపల
బోటు (Al Kambar) గురువారం హైజాక్ అయింది. తొమ్మిది మంది
పైరేట్స్, పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
తొలుత
ఐఎన్ఎస్ సుమేధా సముద్రపు
దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్ఎస్
త్రిశూల్ నౌక దానికి తోడుగా వెళ్ళింది. బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోగా 23 మంది పాకిస్తానీయులు
సురక్షితంగా బయటపడ్డారు.
ఈ నెల మొదట్లో భారత నేవీ మరో
నౌకను సముద్రపు దొంగల దాడి నుంచి రక్షించింది. ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక
రంగంలోకి దిగి పైరేట్లను తరిమికొట్టింది. 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా
రూయెన్‌లోని 17 మంది సిబ్బంది ప్రాణాలతో
బయటపడ్డారు.