కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 19న తొలి విడత ఓటింగ్ జరిగే రోజు నుంచి జూన్ 1న ఏడవ విడత ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ ఫోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సీఈసీ తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.
ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రసారం చేయడం, ప్రచురించడం చేస్తే శిక్ష తప్పదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గురువారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలింగ్ ముగియడానికి రెండు రోజుల ముందు నుంచి మీడియాలో ఫలితాల గురించి ఎలాంటి అంచనాలతో సర్వేలు ప్రసారం చేయడానికి వేల్లేదని నోటిఫికేషన్లో వెల్లడించింది.