ప్రజాగళం యాత్రలో భాగంగా టీడీపీ
అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. నెల్లూరు లోక్సభ స్థానం
టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే
అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా పర్యటనలో పాల్గొన్నారు. ప్రజల
ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందన్న చంద్రబాబు, వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి
లేదన్నారు.
గత
ఐదేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్న చంద్రబాబు, చెత్త మీద కూడా
ముఖ్యమంత్రి పన్ను వేశారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడంతో పాటు యువతకు ఉద్యోగాలు
వచ్చాయా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా అని ప్రజలను
ప్రశ్నించారు. జాబ్ రావాలంటే బాబు రావాలని
నినదించారు.
గడిచిన ఐదేళ్ళలో ప్రజలు ఎన్నో
నష్టపోయారని, వాటిని గుర్తుచేయడానికే ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి వచ్చినట్లు
చంద్రబాబు చెప్పారు. జగన్ పై ప్రజావ్యతిరేకత
తుపానుగా మాదిరిగా మారిందన్నారు. ప్రజాగ్రహానికి ఫ్యాను గిలగిలా కొట్టుకోవడం
ఖాయమన్నారు.