ఎన్నికల
ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం యాత్ర’ మూడో రోజు కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలో గురువారం
పర్యటించిన జగన్, నేడు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో యాత్ర కొనసాగిస్తున్నారు.
ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభలో జగన్
పాల్గొని ప్రసంగించారు.
పెంచికలపాడు
నుంచి జగన్ యాత్ర ప్రారంభం కాగా పెద్దసంఖ్యలో వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. టీడీపీ
నేత కృష్ణా రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. హెచ్
కైరవాడిలో జగన్ నిర్వహించిన రోడ్ షోకి విశేష స్పందన లభించింది.
ఎమ్మిగనూరు
సభ లో జనసముద్రం కనిపిస్తోందన్న జగన్, మే 13న కురుక్షేత్ర యుద్దం జరగబోతుందన్నారు.
పేదలంతా ఓ వైపు ఉంటే పెత్తందారులు మరో
వైపు ఉన్నారన్నారు. పేదల పక్షాన నిలబడి పెత్తందారులను ఓడించేందుకు తాను సిద్ధంగా
ఉన్నానని తెలిపిన జగన్, మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రజలను ప్రశ్నించారు. జెండాలు
జత కట్టిన వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారా అని కోరారు. గడిచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో ప్రతీఇంటికి మంచి
జరిగిందన్నారు. గడిచిన 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.