తెలుగుదేశం
పార్టీ ఎట్టకేలకు పెండింగ్ లోని 9 శాసనసభ స్థానాల టికెట్ల తో పాటు నాలుగు పార్లమెంటు
స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ,
జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు తోడు వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలకు
కూడా టీడీపీ ప్రాధాన్యమిచ్చింది.
మాజీమంత్రి
గంటా శ్రీనివాసరావును భీమిలి నుంచి బరిలోకి దింపుతున్న టీడీపీ, మరో సీనియర్ నేత
కళా వెంకటరావుకు చీపురుపల్లి టికెట్ కేటాయించింది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన
గుమ్మనూరు జయరామ్ ను గుంతకల్లు నుంచే బరిలో దింపుతున్నట్లు తెలిపింది. జయరామ్
2019లో వైసీపీ నుంచి గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈ దఫా వైసీపీ
నుంచి సిట్టింగ్ స్థానానికి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఆ పార్టీని వీడి టీడీపీ లో
చేరారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు ఈసారి సైకిల్ గుర్తుపై పోటీకి
దిగుతున్నారు.
టీడీపీ
ప్రకటించిన జాబితా
చీపురుపల్లి-
కళా వెంకట్రావు
భీమిలి-
గంటా శ్రీనివాసరావు
పాడేరు-
కె. వెంకటరమేశ్ నాయుడు
దర్శి-
గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట-
సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు-
వీరభద్ర గౌడ్
గుంతకల్లు-
గుమ్మనూరు జయరామ్
అనంతపురం
అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
కదిరి-
కందికుంట వెంకట ప్రసాద్
పార్లమెంట్ అభ్యర్థులు
విజయనగరం-
కలిశెట్టి అప్పలనాయుడు
ఒంగోలు-
మాగుంట శ్రీనివాసులురెడ్డి
అనంతపురం-
అంబికా లక్ష్మీనారాయణ
కడప-
భూపేష్‌రెడ్డి