వైసీపీ
అధినేత సీఎం జగన్, సిద్ధం సభల పేరిట అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు
మండిపడుతున్నారు.
లక్ష మందితో సభ నిర్వహించాలని వైసీపీ
భావిస్తే 30 వేల మంది కూడా రావడం లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం ఎద్దేవా చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
విజయవాడలో
గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చర్యలు తీసుకున్నారని నాగభూషణం
ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పురందరేశ్వరి, చంద్రబాబు పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నాశనం
అవడానికి జగన్ ప్రధాన కారణమని విమర్శించిన నాగభూషణం దీనిపై ఎవరైనా చర్చకు సిద్ధమా
అని సవాల్ విసిరారు. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తేలడంతో
జగన్
కు ఓటమి భయం పట్టుకుందన్నారు.
ఎన్నికల
ప్రచారంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆదోని బీజేపీ
అభ్యర్థి డాక్టర్ పార్ధసారధి అన్నారు. గత ఎన్నికల సమయంలో
125 హామీలు ఇచ్చిన జగన్, ఎన్నింటిని
నెరవేర్చాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
రాయలసీమకు
ఏం చేశారో జగన్ చెప్పగలరా అని దుయ్యబట్టారు. గతంలో 151 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే జగన్ చేసిన నిర్వాహకం చూసి
ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ సారి 15
సీట్లలో కూడా వైసీపీ గెలవలేదని జోస్యం చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించడం
ఖాయమన్నారు.