Kejriwal Custody Extended by Four More Days
అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ గడువును
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. మద్యం పాలసీ
కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది.
కేజ్రీవాల్‌ను మార్చి 15న ఈడీ అధికారులు ఆయన
ఇంటినుంచి అరెస్ట్ చేసారు. ఆయనకు న్యాయస్థానం ఇవాళ్టి వరకూ కస్టడీ విధించింది.
అయితే కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని, కనీసం మరో వారం రోజులు విచారణకు కావాలనీ
ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. వారి మనవిని న్యాయస్థానం
పరిగణనలోకి తీసుకుంది. కేజ్రీవాల్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది.
లిక్కర్ పాలసీ కేసు విచారణలో అరవింద్ కేజ్రీవాల్ తన
పేరును నలుగురు మాత్రమే ప్రస్తావించారనీ, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేందుకు ఆ
నాలుగు వాంగ్మూలాలే సరిపోతాయా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇవాళ కోర్టులో కేజ్రీవాల్
తన కేసును తానే వాదించుకున్నారు.
మద్యం విధానం కేసు రాజకీయ కుట్ర అని, దానికి
ప్రజలే తగిన జవాబు చెబుతారనీ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కోర్టులోకి వెడుతుండగా
మీడియా ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.