ఆప్
కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో స్వల్ప ఉపశమనం లభించింది. లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో
అరెస్టు అయిన కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిల్ ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఈ
పిటిషన్ బెంచ్ ముందుకు రాగా దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్
సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమని, అలాగే జైలు నుంచి కేజ్రీవాల్
నుంచి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించడాన్ని అడ్డుకోలేమని పిటిషనర్‌కు తేల్చి
చెప్పింది.
ఆర్థిక
కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న
వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అనర్హుడంటూ దిల్లీకి చెందిన రైతు, సామాజికవేత్త సుర్జిత్‌సింగ్
యాదవ్ వేసిన పిటిషన్ విచారణకు సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా అరవింద్
కేజ్రీవాల్ ను ఈడీ, మార్చి 21న అరెస్టు చేసింది. కోర్టు విధించిన కస్టడీ నేటితో
ముగియడంతో రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో ఆయనను ప్రవేశపెట్టారు. రాజకీయ ప్రతీకార
చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదైనట్లు కోర్టు హాలులోకి వెళ్లే ముందు కేజ్రీవాల్
వ్యాఖ్యానించారు.