తిరుమల
నడకదారిలో మరోసారి చిరుత సంచారం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అలిపిరి నడక
మార్గంలో ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించినట్లు సీసీ
కెమెరా ఫుటేజీ ద్వారా నిర్ధారణ అయింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత
కదలికలు గుర్తించారు.
గత
సంఘటనల నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న టీటీడీ సిబ్బంది,
రాత్రి
సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి పంపుతున్నారు. భక్తులకు కర్రలు
అందజేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి
రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు.
కొంత కాలంగా నడకమార్గంలో చిరుతల కదలికలు భక్తులను భయాందోళనలకు గురి
చేస్తున్నాయి. గతంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. టీటీడీ
విజిలెన్స్ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు కొన్ని చిరుతలను
పట్టుకుని జూకు తరలించిన విషయం తెలిసిందే.