బాలీవుడ్ నటి, బీజేపీ నేత కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. తాజాగా విడుదల చేసి లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి సుప్రియా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆ స్థానం నుంచి వీరేంద్ర చౌదరి పోటీ చేస్తాడని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సుప్రియా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని అధిష్ఠానం భావించిందని తెలుస్తోంది.
నటి కంగనకు బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి సీటు కేటాయించింది. వెంటనే ఆమెపై సుప్రియా లైంగిక ఆరోపణలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా కంగనకు మద్దతు లభించింది. సెక్స్ వర్కర్ల జీవితాలను ప్రస్తావించి, ఇతరులను దూషించడం మానుకోవాలని కంగన మండిపడ్డారు. ఆమెకు అన్ని వర్గాల ప్రముఖల నుంచి మద్దతు లభించింది.