కాకినాడలోని
పెద్ద శివాలయంలో అర్చకుడిపై దాడి చేసిన వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరాయల చంద్రరావును
కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు.
కేసును
వెనక్కి తీసుకోవాలంటూ రెండు రోజులుగా బాధిత అర్చకుడి ఒత్తిడి పెడుతున్న వైసీపీ
నేతలు, మరోవైపు దేవాదాయ శాఖ, పోలీసు శాఖలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు.
దేవాదాయ
శాఖ ఇన్చార్జి ఆర్జేసీ విజయరాజు ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలో రాజీకోసం ప్రయత్నించారు.
దాడి చేసిన వ్యక్తితో బలవంతంగా క్షమాపణలు చెప్పించేందుకు ప్రయత్నించారు.
ఎమ్మెల్యే
ద్వారంపూడి శివాలయానికి వెళ్ళి అర్చకుడు సాయిని పరామర్శించారు. జరిగిన ఘటనపై పశ్చాతాపం
వ్యక్తం చేశారు. వివాదానికి ఇంతటితో చెక్ పెట్టాలని కోరారు. దేవాదాయ శాఖ రాష్ట్ర
సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ సైతం అర్చకులతో ఫోన్లో మాట్లాడి రాజీకి
ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
దాడి
ఘటనపై విచారణ జరిపిన దేవాదాయ శాఖ ఆర్జేసి విజయరాజు బాధిత అర్చకుల నుంచి వివరణ
తీసుకున్నారు. అనంతరం కాకినాడ డీఎస్పీతో మాట్లాడి విచారణ నివేదికను కమిషనర్ కు
అందజేశారు.
దాడికి
పాల్పడిన సిరియాల చంద్రరావు పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే చలో కాకినాడకు
పిలుపునిస్తామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు.
వీహెచ్పీ
కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
సంఘాల కార్యదర్శి గంధం గోవింద్, హైందవ
వీర అధ్యక్షుడు పీ వరప్రసాద్ తదితరులు బుధవారం అర్చకులను కలిసి సంఘీభావం తెలిపారు.