సార్వత్రిక
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఏడో
జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ఆ పార్టీ ప్రకటించింది.
లోక్సభ
టికెట్ ఆశించి నిరాశ చెందిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లభించింది. ఆయనకు
గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఈ
స్థానంలోని వైసీపీ తరఫున అసీఫ్ పోటీకి దిగనున్నారు.
కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ సీనియర్
నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు మరోసారి అవకాశం కల్పించిన బీజేపీ, జమ్మలమడుగు
అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దించనుంది.
భారతీయ
జనతాపార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్య కుమార్ కు ధర్మవరం అసెంబ్లీ టికెట్
లభించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం సత్యకుమార్ కు ఇదే ప్రథమం. ఉమ్మడి
అనంతపురం జిల్లాకు చెందిన సత్యకుమార్ , బీజేపీ లో కీలకనేతగా ఉన్నారు.
బీజేపీ
ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులు…
అదోని
– పీవీ పార్థ సారధి
ధర్మవరం-సత్యకుమార్
ఎచ్చెర్ల
– ఎన్. ఈశ్వర్ రావు
విశాఖ
నార్త్ – విష్ణు కుమార్ రాజు
అరకు
– పంగి రాజారావు
విజయవాడ
వెస్ట్ – సుజనా చౌదరి
కైకలూరు
– కామినేని శ్రీనివాస్ రావు
అనపర్తి
– శివకృష్ణం రాజు
బద్వేల్
– బొజ్జా రోషన్న
జమ్మలమడుగు
– ఆదినారాయణ రెడ్డి
మహారాష్ట్రలోని
అమరావతి (ఎస్సీ) స్థానం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సినీనటి నవనీత్
కౌర్ రాణా గెలుపొందారు. ఈ సారి ఆమె బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు.
కేంద్ర
ఎన్నికల సంఘం ఆమోదంతో తమ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును బీజేపీ బుధవారం రాత్రి
ప్రకటించింది.
2019
లోక్సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి శివసేన నేత ఆనందరావు అడ్సుల్పై నవనీత్
రాణా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
కర్ణాటకలోని
చిత్రదుర్గ(ఎస్సీ) సీటు నుంచి కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ను
బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎ. నారాయణస్వామి గెలుపొందగా.
ఈసారి అభ్యర్థిని మార్పు చేసింది.
హర్యానా
మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో కర్నాల్ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో..
అక్కడి నుంచి ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీని పోటీలో నిలిపింది.