TM Krishna the controversial Hinduphobic musician
సుమారు పది రోజులుగా దక్షిణభారతదేశపు
శాస్త్రీయసంగీత ప్రపంచం అల్లకల్లోలమైపోతోంది. కారణం, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఈ యేడాది సంగీతకళానిధి పురస్కారాన్ని టిఎం
కృష్ణకు ప్రకటించడమే. ఆ నిర్ణయం కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతులైన విద్వాంసుల్లో
తీవ్ర ఆగ్రహాన్ని కలగజేసింది. కృష్ణకు సంగీతకళానిధి అవార్డు ప్రకటించడంపై
తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంతకీ ఎవరీ టిఎం కృష్ణ?
కర్ణాటక సంగీతంలో చక్కటి గాయకుల్లో
కృష్ణ కూడా ఒకడు. అయితే సంప్రదాయిక హిందూ ఆచారాలకు వ్యతిరేకి. భక్తిముక్తిదాయకమైన
కర్ణాటక సంగీతాన్ని భ్రష్టుపట్టించిన ఘనుడు. క్రైస్తవ, ముస్లిం గీతాలకు కర్ణాటక సంగీత బాణీలు కట్టి పాడి, సమకాలీన సహచర విద్వాంసుల విమర్శలు మూటగట్టుకున్నవాడు. హిందూవ్యతిరేక
వ్యాఖ్యల చేయడం, బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రచారం చేయడం
అతని నిత్యకృత్యాలు. కర్ణాటక సంగీతంలో బ్రాహ్మణులు ఎక్కువమంది ఉండడంతో వారిపై
దూషణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా
ఎప్పుడూ వార్తల్లో ఉండడం అతని ప్రత్యేకత. త్యాగరాజస్వామిని, ఎంఎస్ సుబ్బులక్ష్మిని సైతం తప్పులు పట్టిన మహానుభావుడతను.
భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో
మద్రాస్ మ్యూజిక్ అకాడెమీది ఒక ప్రత్యేకమైన స్థానం. 1928లో స్థాపించిన ఆ సంస్థ
సనాతన ధర్మం పట్ల భక్తిశ్రద్ధలు కలిగిఉండడం అనే నియమాన్ని, సంప్రదాయాన్నీ ఆదినుంచీ అనుసరిస్తూ వస్తోంది. 1942లో ఆ సంస్థ
సంగీతకళానిధి అవార్డును ప్రవేశపెట్టింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి, డికె పట్టమ్మాళ్ వంటి మహానుభావులకు ఆ అవార్డును ప్రదానం చేసి సంగీత
ప్రపంచంలో సమున్నత స్థాయిని నిలబెట్టింది. అలాంటి సంస్థ అంతటి అత్యున్నత
పురస్కారాన్ని హిందూ వ్యతిరేకి, అర్బన్ నక్సలైట్ అయిన టిఎం కృష్ణకు
ప్రదానం చేయడం వివాదానికి దారితీసింది.
‘‘సంగీతానికి సాహిత్యంతో సంబంధం లేదు.
కర్ణాటక సంగీతంలో భక్తి సాహిత్యాన్ని ప్రవేశపెట్టి, దాన్నిబ్రాహ్మణులు కబ్జా చేసేసారు. త్యాగరాజ కృతుల్లో కుల వివక్ష,
లింగ వివక్ష ఉన్నాయి. త్యాగరాజును సాధువుగా,
భగవత్ స్వరూపుడిగా చూడడం, ఆరాధించడం సరికాదు. అసలు త్యాగరాజ కృతులు ప్రస్తుతకాలానికి
పనికిరావు. సంగీత కచేరీల్లో సంప్రదాయిక వస్త్రధారణలోనే ఎందుకు పాల్గొనాలి? అది బ్రాహ్మణాధిక్యతకు నిదర్శనం. కర్ణాటక సంగీతంలో ఆధ్యాత్మిక భావాలు
అనవసరం. భక్తికి, సంగీతానికి సంబంధం ఏమిటి? అసలు హిందూ దేవుళ్ళ పైన మాత్రమే కీర్తనలు ఎందుకు పాడాలి. నెలకి ఒక
క్రైస్తవ లేదా ముస్లిం కీర్తన రాస్తాను, పాడతాను.’’…
ఇవీ కృష్ణ ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే.
నాస్తికవాది, హిందువులను ప్రత్యేకించి బ్రాహ్మణులను అంతం చేయాలని పిలుపునిచ్చిన
ఈవీ రామస్వామి నాయకర్ అభిమాని అయిన కృష్ణ, కర్ణాటక
సంగీతరంగంలో బ్రాహ్మణాధిక్యత కొనసాగుతోందంటూ నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటాడు,
దాన్ని అంతం చేస్తానని కంకణం కట్టుకున్నాడు.
సంఘ సంస్కరణ, సామాజిక న్యాయం పేరిట సనాతన ధర్మంపై
నిరంతరం విషం చిమ్మడమే అతని పని.
దేశ వ్యతిరేక శక్తులుగా వ్యవహరించే
వ్యక్తులు, సంస్థలతో కృష్ణకు ఎనలేని అనుబంధం ఉంది.
పర్యావరణ పరిరక్షకుడిగా ప్రచారం చేసుకునే నిత్యానంద్ జయరామన్కు కృష్ణ అత్యంత
సన్నిహితుడు. అతను తమిళనాడులో అభివృద్ధి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు,
ఆందోళనలూ చేయడంలో దిట్ట. అతనితో కలిసి
అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాల్లో టిఎం కృష్ణ పాల్గొనడం కూడా విమర్శలకు
తావిచ్చింది.
భక్తి వినా సన్మార్గము లేదని
చాటిచెప్పే కర్ణాటక సంగీతం స్వరూప స్వభావాలను మార్చివేసి, దాని మూలాలను పెరికివేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న కళాకారుడు
టిఎం కృష్ణ. విచిత్రం ఏంటంటే గత పదేళ్ళలో అతను బహిరంగ వేదికల మీద ఏనాడూ కచేరీ
చేయలేదు. యూట్యూబ్ ద్వారా పేరు గడించిన కళాకారుడు. ప్రతిభ కంటె, వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉన్నాడు. ఒక్కమాటలో
చెప్పాలంటే, టిఎం కృష్ణ, కర్ణాటక సంగీత కాసారంలో కశ్మలం.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు