వైసీపీ
ప్రభుత్వం పట్ల స్వామిభక్తి ప్రదర్శించే అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
చేసినట్లు బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు.
బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పేరిటి ఫేక్ లెటర్ ను వైసీపీ సోషల్ మీడియా వైరల్
చేసిందన్నారు. నకిలీ లెటర్ సృష్టిలో సజ్జల భార్గవ్ పాత్ర ఉన్నట్లు తేలిందన్నారు.
ప్రజలకు
సంబంధించిన సమాచారం అంతా వలంటీర్ల దగ్గర ఉందన్న షేక్ బాజీ, దీనిపై ఎన్నికల సంఘం
విచారణ జరపాలని కోరారు.
అంగన్వాడీ, డ్వాక్రా
మహిళలను పోలింగ్ సిబ్బందిగా నియమించవద్దు అని కోరారు. అలాగే గ్రామసచివాలయ సిబ్బందిని
వేరే చోట నియమించాలన్నారు.
ఈవీఎం
ఐడెంటిఫికేషన్ చేసేలా స్ధానిక బాషల్లో ఎంఎల్ఏ, ఎంపీ
ఓట్లకు విడిగా బాక్సులు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.
వికలాంగ ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు విని
యోగించకూడదని నిబంధనలు చెబుతున్నా ఎందుకు బేఖాతరు చేస్తున్నారని ప్రశ్నించారు. చివరి నిముషం వరకూ ఓటు వేసే
వారికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు మల్లిఖార్జునమూర్తి, హేమంత్ కుమార్ పాల్గొన్నారు.