సీపీఎం ముఖ్యనేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
కుమార్తె వీణా విజయన్ పై కేసు నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద
వీణావిజయన్ తో పాటు ఆమెకు చెందిన ఐటీ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది.
ఓ మినరల్
కంపెనీ నుంచి అక్రమ చెల్లింపు జరిగినట్లు తేలడంతో కేంద్ర సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
కొచ్చి కేంద్రంగా పనిచేసే కొచ్చిన్ మినరల్
అండ్ రుటైల్ లిమిటెడ్, నుంచి వీణా విజయన్ నేతృత్వంలోని ఎక్జా లాజిక్ అనే కంపెనీకి రూ. 1.72 కోట్ల
చెల్లింపులు జరిగాయి. ఎలాంటి సర్వీసులు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఫిర్యాదు
అందడంతో కేసు నమోదైంది. ఓ ప్రముఖ వ్యక్తితో ఉన్న సంబంధాల కారణంగానే సదరు మినరల్
సంస్థ వీణా కంపెనీకి నెలవారీ చెల్లింపులు చేసినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్
ఆఫీస్ ఫిర్యాదు చేసింది.
దర్యాప్తును
నిలిపివేయాలంటూ ఎక్జా లాజిక్ కంపెనీ కర్ణాటక
హైకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం దక్కలేదు. గత నెలలో పిటిషన్ కొట్టివేసిన
హైకోర్టు, విచారణ విషయంలో కేంద్ర విచారణా సంస్థల చేతులు కట్టేయలేమని
వ్యాఖ్యానించింది.
తన
కుమార్తె పై వస్తున్న ఆరోపణలపై ఈ ఏడాది జనవరిలో
అసెంబ్లీ వేదికగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. తన భార్య పదవీ
విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో కుమార్తె వీణ కంపెనీని ప్రారంభించిందని చెప్పారు. తనతో
పాటు కుటుంబ సభ్యుల మీద ో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు